Pages

Friday, November 25, 2011

ఎప్పుడు ఒప్పుకోవద్దు రా వోటమి !!!

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విశ్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా... నింగి యెంత పెద్దదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటక పడని అగ్గి వుండ సాగరాన నీదుకుంటు తూరుపింట తేలుతుందిరా నిషావిలాసమెంత సేపు రా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడ అగ్నిగోళమంటిదేనురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా

ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారెదెవరురా

నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా

నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే

No comments:

Post a Comment